విలియమ్సన్ 242 నాటౌట్

వెల్లింగ్టన్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ బ్యాట్స్మన్ కేన్ విలియమ్సన్ డబుల్ సెంచరీ సాధించాడు. కష్టాల్లో పడిన జట్టును అజేయ ద్విశతకంతో ఆదుకున్నాడు. విలియమ్సన్ కు తోడు బీజే వాల్టింగ్ సెంచరీ చేయడంతో రెండో ఇన్నింగ్స్ లో కివీస్ భారీ స్కోరు చేసింది. 524/5 స్కోరు వద్ద డిక్లేర్ చేసి శ్రీలంక ముందు 390 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది.

విలియమ్సన్ 438 బంతుల్లో 18 ఫోర్లతో 242 పరుగులు చేశాడు. వాల్టింగ్ 333 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్ తో 142 పరుగులు సాధించాడు. ఆరో వికెట్ కు వీరిద్దరూ 365 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి శ్రీలంక నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 45 పరుగులు చేసింది