వివక్ష నిర్మూలనకు దీర్ఘీకాలిక చర్యలు అవసరం : జేపీ
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికకు పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు లోక్‌సత్తా అధినేత జేపీ ప్రకటించారు. శాసనసభలో ఉప ప్రణాళికపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నేటికీ సమాజంలో కుల వివక్ష పోలేదని… దీర్ఘకాలిక చర్యలు లేకపోతే వివక్షను పూర్తిగా నిర్మూలించలేమని అన్నారు. అశాస్త్రీయమైన పద్ధతులను పాటించడం వల్లే వివక్ష నిర్మూలన సాధ్యం కాలేదని తెలియజేశారు. ఉప ప్రణాళికలో కేటాయించే నిధులకు ఫలితం వచ్చేలా చూడాలని సూచించారు. కుల వివక్ష తొలగించేందుకు విద్యను మించిన ఆయుధం లేదని పేర్కొన్నారు.