వివాదంలో వాయలార్‌ రవి

ఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌కురియన్‌ వివాదం ఇంకా ఒక కొలిక్కి రాలేదు, వాయలార్‌ రవి ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువయ్యారు. కురియన్‌ మీద ఆరోపణల విషయంలో మీ అభిప్రాయమేంటని ప్రశ్నించిన ఒక మహిళ జర్నలిస్టుతో రవి అమర్యాదకరంగా మాట్లాడారని జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. కేరళలో వారునిరసన ప్రదర్శన చేపట్టడంతో వాయలార్‌ రవివారికి క్షమాపణ చెప్పారు. రవివ్యాఖ్యల వీడియో బహిర్గతం కావడంతో ఆయనపై చర్య తీసుకోవాలంటూ భాజపా డిమాండ్‌ చేస్తోంది. కెమెరా ఎదురుగానే ఇలా ప్రవర్తిస్తే ఇక కెమెరా లేనప్పుడు ఆయన ప్రవర్తన ఎలా ఉంటుందని ప్రశ్నిస్తోంది. వ్యక్తిగత క్షమాపణ కాదు, బహిరంగంగా చెప్పాలంటోంది. అసభ్యంగా మాట్లాడినవారిపై చర్యలు తీసుకోవడం ద్వారా కాంగ్రెస్‌ సమాజంలోకి తప్పుడు సంకేతాలు పంపుతోందని భాజపా నేత స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు.