వివాహితతో అసభ్య ప్రవర్తన
పాల్వంచ, మార్చి 16: స్థానిక కేటీపీఎస్ కాలనీలో బాకీ వసూలుకు వెళ్లిన ఓ ప్రబుద్ధుడు వివాహితతో అసభ్యంగా ప్రవర్తించి కటకటాలపాలయ్యాడు. పట్టణంలోని బంగారం షాపు యజమాని సోమవారం ఉదయం బాకీ వసూలు చేసేందుకు ఓ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఇంటి యజమానురాలు ఒంటరిగా ఉండటంతో ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ప్రబుద్ధుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.