వివాహిత ఆత్మహత్య
వివాహిత ఆత్మహత్య
ఆత్మకూరు, అప్పుల భాధతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది ఎస్సై క్రాంతి కుమార్ కధనం ప్రకారం గ్రామానికి చెందిన సాకారపు వరదరాజుకు ధర్మసాగర్ మండలం పీచర గ్రామ వాసి పద్మ (30) తో ఎనిదేళ్ల కిందట వివాహం జరిగింది వీరికి ముగ్గురు కొడుకులు రెండేళ్ల క్రితం నిర్మంచుకున్న ఇంటికోసం చేసిన అప్పులు ఎక్కువ కావడంతో తరచూ భార్యభర్తల మధ్య
గొడవలు జరుగుతుండేవి బుధవారం సాయంత్రం పొలం పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన పద్మ పురుగుల మందు తాగి పడిపోయింది వదరరాజు అపస్మారకస్థితిలో ఉన్న భార్యను చూసి గ్రామస్థుల సహాయంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది మృతురాలి తండ్రి గాలి కొంరయ్య ఫిర్యాదు
మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.