వివిధ భాషాకోవిదులకు ప్రణబ్ సత్కారం
న్యూఢిల్లీ: భాషా కోవిదులను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ బుధవారం ఘనంగా సత్కరించారు. సంస్కృతం, పర్షియన్, అరబిక్, పాలి తదితర భాషా పండితులు 23 మందికి ఆయన ఈ పత్రాలను ప్రదానం చేశారు. మరో ఆరుగురు భాషా స్రష్టలకు ప్రతిష్ఠాత్మక మహర్షి బాదరాయణ్ వ్యాన్ సమ్మాన్‌ను ప్రదానం చేసినట్లు అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. గౌరవపత్రాలు స్వీకరించిన వారిలో 15మంది సంస్కృత పండితులు, ముగ్గురు పర్షియన్ భాషాకోవిదులు, ముగ్గురు అరబీ పండితులు కాగా మిగిలిన వారు పాలి, ప్రాకృత భాషా పండితుని తెలిపారు.