విశ్వజన్ దోమ ఎస్ఐ దోమ జనం సాక్షి. దోమ మండల ప్రజలకు తెలియజేయునది ఏమనగా ప్రస్తుతం జరుగుతున్న పరిమాణాలు దృష్టిలో పెట్టుకొని ఎవరైనా మతవిద్వేషాలను గాని ఒక వర్గాన్ని కించపరిచే విధంగా గాని అవమానపరిచే విధంగా గాని చేస్తూ దానికి సంబంధించిన పోస్ట్లు పెట్టడం రాతలు రాయడం చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకొనబడును.
*మండల సభలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గండ్ర*
*సమన్వయంతో పనిచేసి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు*
రేగొండ : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గురువారం రేగొండ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీపీ పున్నం లక్ష్మి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై మండలంలో ఉన్న పలు ప్రభుత్వ శాఖల అధికారులతో చర్చించారు. వ్యవసాయ అధికారి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ చేసుకొని రైతులందరూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. తెలియని రైతులకు సర్పంచులు ఎంపీటీసీలు బీమా దరఖాస్తు చేసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. పి ఆర్ సతీష్ బాబు మాట్లాడుతుండగా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నామని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిలదీశారు. సిసి రోడ్లు, పంచాయతీరాజ్ పనుల విషయంలో నాణ్యత లోపంగా ఉంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తీసుకున్నప్పుడు సరిగ్గా పని చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్లు ఎన్ని వచ్చాయని ఎంపీడీవో సురేందర్ ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అడగడంతో ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో అసలు నువ్వు ఏం పని చేస్తున్నావ్, నిదర్శనం ఇదేనా అని అన్నారు. ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోనని సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. వెంటనే జిల్లా అధికారికి ఫోన్ చేసి మండలానికి ఎన్ని కొత్త పింఛన్ వచ్చాయని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అడిగి తెలుసుకున్నారు. కనకయ్య మాట్లాడుతుండగా ఇకనుండి మండలంలో విద్యుత్ సమస్యలు వస్తాయని వెంటనే దగ్గరుండి పరిష్కరించమని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. రైతులకు అందుబాటులో ఉండాలని అన్నారు. ఎంపీ ఓ సురేష్ మాట్లాడుతుండగా సుల్తాన్పూర్ సర్పంచ్ అంబాల చందు మాకు నర్సరీ ఉన్నప్పటికీ సొంతంగా మొక్కలు తెచ్చి అధిక రేటు చెల్లించాలని ఎంపీ ఓ ఇబ్బందుల గురిచేస్తున్నాడని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యే స్పందించి సర్పంచ్ల పై తనం ఏమిటి అని ఇంకోసారి ఇలా చేయకూడదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి మొక్కలు నాటాలో సర్పంచ్లకు సూచించాలి కానీ మీరు సొంతగా మొక్కలు కొనుక్కుని వచ్చి వారికి అంటగట్టదని హెచ్చరించారు.
అనంతరం మండల సభను ఉద్దేశించి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కొత్తగా 1970 పెన్షన్లు మంజూరయ్యాయని ఈ పెన్షన్లను మూడు రోజుల్లో గ్రామ గ్రామాన సభలు నిర్వహించి కార్డులు పంపించేస్తామని తెలిపారు. అధికారులంతా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. అనంతరం నితనంగా నియమింపబడ్డ రైతు బంధు జిల్లా కోఆర్డినేటర్ ఇండియా మహేందర్ కు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ హింగే మహేందర్, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఎండి రహీం, జడ్పిటిసి సాయిని విజయ, తాసిల్దార్ మహమ్మద్ షరీఫ్, ఎంపీడీవో సురేందర్, ఎంపిటిసిల ఫోరం జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి రవీందర్ రావు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.