విశ్వనగరం నిర్మిద్దాం

C

రాజకీయ పక్షాల సహకారం కావాలి

సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌,మే26(జనంసాక్షి): హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రాజకీయ పక్షాలి సహకరించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రపంచం ఇప్పుడు హైదరాబాద్‌ వైపు చూస్తోందని, ఈ దశలో హైదరాబాద్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అసవరం ఉందని సిఎం కెసిఆర్‌ అన్నారు. ఇందుకు అందరం కలసి కృషి చేద్దామని నగర ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు.  ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీలో స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంపై నగరానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, కంటోన్మెంట్‌ సభ్యులతో సీఎం కేసీఆర్‌ సమావేశం నిర్వహించారు. సమావేశంలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాసయాదవ్‌, పద్మారావు పాల్గొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేశ్‌కుమార్‌ ముఖ్యమంత్రికి వివరాలు అందజేశారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో 390 కి.విూ.పొడవైన 72 నాలాల పరిస్థితి బాగాలేదు. వర్షపు నీరు పోవాల్సిన నాలాల్లో మురికి నీరు ప్రవహిస్తుంది. నాలాలపైనా, నాలాల నీళ్లలో కూడా కట్టడాలు వచ్చాయి. వీటిని సరిచేయాల్సిన అవసరం ఉంన్నారు. శానిటేషన్‌ పరిస్థితి బాగా లేదు. ప్రతిరోజూ నాలుగువేల మెట్రిక్‌ టన్నుల చెత్త తయారవుతోందన్నారు. చెత్తను బయటకు పంపే ఏర్పాట్లు బాగా లేవు. చెత్త తొలగింపు విషయంలో అందరం కలిసి నిర్ణయం తీసుకోవాలన్నారు. . చెత్త ఏరివేయడంతో పాటు శిథిలాల తొలగింపు కూడా ముఖ్యమే. చాలా బస్తీల విూదుగా హైటెన్షన్‌ వైర్లు పొతున్నాయి. దీనివల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. పాతబస్తీతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో లోవోల్టేజ్‌ సమస్య ఉన్నట్లు మా దృష్టికి వచ్చిందని వివరించారు. చాలా చోట్ల మురికినీరు, మంచినీరు కలిసి సరఫరా అవుతుంది. ఈ సమస్యల పరిష్కారానికి శాశ్వత ప్రతిపదికన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  మాటలు బంద్‌.. ఇక నుంచి పనులు జరగాలి. ఎన్ని డబ్బులు కావాలన్నా ఇస్తాం. రాజకీయాలకతీతంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు పనులు పర్యవేక్షించాలని కోరారు.  ఇంకా నిర్లక్ష్యం చేస్తే నగరం చేతిలో ఉండదు. బాగు చేద్దామన్నా, చేసుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడైనా జాగ్రత్త పడాలి. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులు హైదరాబాద్‌ వస్తున్నారు. మనం మన హైదరాబాద్‌ను మంచిగా తీర్చిదిద్దుకుందామని కెసిఆర్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ నగరంలో 390 కిలోవిూటర్ల పొడవైన 72 నాలాల పరిస్థితులు బాగాలేవని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. సిఎం ప్రతిపాదనలపై విపక్షాలు సానుకూలంగా స్పందించాయి. తమవంతు సహకారం ఉంటుందన్నారు.