విూటర్‌ కనెక్షన్‌ కోసం డబ్బుల డిమాండ్‌

ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన ప్రజలు

నల్గొండ,జూన్‌8(జ‌నం సాక్షి): మిర్యాలగూడెం పట్టణంలోని తల్లాగడ్డ ఇందిరమ్మ కాలనీలో కరెంటు విూటర్లకు కనెక్షన్‌ ఇవ్వడానికి స్థానిక లైన్‌ మెన్‌ డబ్బులు డిమాండ్‌ చేస్తూ కనెక్షన్‌ ఇవ్వకుండా ఇబ్బంది పేడుతుండడంతో స్థానికులు సంబందిత డీఈ దృష్టికి తీసుకెళ్లారు. ఐనా కూడా లైన్‌ మెన్‌ ప్రవర్తనలో ఏ మార్పు రాకపోవడంతో మిర్యాలగూడ ఎమ్యెల్యే భాస్కర్‌ రావుని కాలనీ వాసులు కలిసారు. వెంటనే స్పందించిన ఎమ్యెల్యే తన పీఏ కి పని అప్పచెప్పాడు. వెంటనే పీఏ ద్వారా లైన్‌ మెన్‌ కి ఫోన్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నవట అని అడగాగ్గానే…అవును వసూలు చేస్తున్నానని సమాధానం వచ్చింది. తనకు సరిపడా స్టాఫ్‌ లేకపోవడం వల్ల ఇలా చేస్తున్న ఎమ్యెల్యే గారు అంటూ నిర్లజ్జగా సమాధానం చెప్పాడు.