విూడియాలోనూ విూటూ ప్రకంపనలు

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా రెసిడెంట్‌ ఎడిటర్‌ రాజీనామా
హైదరాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  దేశవ్యాప్తంగా విూటూ అంశంపై చర్చ జరుగుతున్న వేళ విూడియాలోనూ కుదుపులు తప్పడం లేదు. ఇప్పటికే మాజీ జర్నలిస్ట్‌ అయిన కేంద్రమంత్రి ఎంజె అక్బర్‌  పదవి అటోఇటో అన్నట్లుగా ఉంది. ఈ దశలో  కొందరి ప్రముఖులపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ రెసిడెంట్‌ ఎడిటర్‌గా పనిచేస్తున్న కేఆర్‌ శ్రీనివాస్‌ తమకు అసభ్యకర సందేశాలు పంపిస్తున్నాడని, తన కోరిక తీర్చాలంటూ ఎక్కడపడితే అక్కడ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించేవాడని కొందరు మహిళలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ హైదరాబాద్‌ విభాగానికి ఎడిటర్‌గా పనిచేస్తున్న ఆయన రాజీనామా చేశారు. రాజీనామా చేసిన మాట వాస్తవమేనని ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ ఎడిటోరియల్‌ డైరెక్టర్‌ జైదీప్‌ బోస్‌ ధృవీకరించారు. తనను టార్గెట్‌ చేస్తున్నందు వల్లే రాజీనామా చేసినట్లు లేఖలో ఆయన వివరించారు.