వి ఆర్ ఏ ల న్యాయమైన సమస్యలు తీర్చాలి

*సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి
తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 17::
రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్న వి ఆర్ ఏ సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారి న్యాయమైన కోరికలు తీర్చాలని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . గత 20 వ తేదీ నుండి కలెక్టర్ కార్యాలయం ముందు 25 నుండి  నిరవధిక సమ్మె నిర్వహింస్తు నేటికీ 24వ రోజు అవుతున్న  సందర్భంగా తూప్రాన్ ఆర్డీవో  కార్యాలయం ముందు చేగుంట, నర్సింగ్ వెల్దుర్తి తూప్రాన్ మనోహరాబాద్ మండలాల గ్రామ రెవెన్యూ సహాయకులు సమ్మె చేస్తున్న వీఆర్ఏ జేఏసీలకు మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి  మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా పేస్కెల్ అమలు చేస్తానని మాట ఇచ్చిన నేటికి అమలుకాకపోవడం సిగ్గు చెట్టానరు . వారసత్వ ఉద్యోగులు , అర్హులైన వారికి ప్రమోషన్డ్లు ఇస్తానని చెపి మోసం చేయడం సరైనది కాదని మండిపడ్డారు . పి ఆర్ సి ప్రతి వీఆర్ఏ కి ఇస్తానని నేటివరకు కనీసం జీవో కూడా ఏర్పాటు చేయకుండా గ్రామ రెవెన్యూ సహాయకులకు ఎలా అమలు చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు . కనీస వేతనాలు లేక , సౌకర్యాలు లేక తీవ్ర మనస్తాపానికి గురైన అనేక మంది వీఆర్ఏలు ఆత్మహత్యలు చేసుకుంటూ చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ప్రభుత్వం ప్రజలకు అందించే అనేక పథకాలు నేరుగా అందేలా చూసేది వీఆర్ఏ అనే సంగతి ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని వారి న్యాయమైన కోరికలు తీర్చాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని హెచ్చరించారు  ఈ కార్యక్రమంలో. గ్రామపంచాయతీ కార్మికుల జిల్లా కార్యదర్శి   ఆసిఫ్,వెంకటేష్, నారాయణ, నరే0దర్ ,సుమలత, శివరాజ్, బీబీబేగం,లక్మకాంత్, శ్రీనివాస్, సురేష్ హాజరుద్దీన్, అశోక్,భూపాల్. తదితరులు పాల్గొన్నారు .

తాజావార్తలు