వి.కె సింగ్‌ను తొలిగించండి
– రాహుల్ ఆందోళన
న్యూఢిల్లీ,డిసెంబర్ 7 (జనంసాక్షి): దళితులకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి వీకే సింస్త్ర ను పదవి నుంచి తొలగించాలని డిమాాం చేస్తూ రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు ధర్నా చేశారు. ఉభయ సభల ప్రారంభానికి పార్లమెంటు ఆవరణలో సోమవారం ఉదయం ఈ ధర్నా జరిగింది. ఇందులో రాజ్యసభ, లోచీ సభలో కాంగ్రెస్ పక్ష నాయకుల గులాం నబీ ఆజా’, మల్లిఖార్జున ఖర్గే, సీనియం నేతలు ఆనం’ శర్మ, దీపేందం హుడా పాల్గొన్నారు. దళితులను ఉద్దేశించి కుక్క్ణ అని వ్యాఖ్యలు చేసిన వీకే సింస్త్ర ను కేంద్రమంత్రి పదవి నుంచి తొలగించాల్సిందేనని వారు డిమాాం చేశారు. ఒక అట్టడుగు సామాజిక వర్గం గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతోనే ఈ విషయంలో తాము పట్టుబడుతున్నామని వారు తెలిపారు. హర్యాణాలో ఇద్దరు దళిత చిన్నారుల హత్య ఘటనపై స్పందిస్తూ ప్రతి స్థానిక సమస్యకు కేంద్రం బాధ్యత వహించదని, కుక్కలపై రాయి విసిరినా ప్రభుత్వమే బాధ్యత వహించాలా అని ఆర్మీ మాజీ చీఫ్ అయిన వీకే సింస్త్ర వ్యాఖ్యానించడం తీవ్ర వివాదం రేపిన సంగతి తెలిసిందే.దీంతో ఉభయసభల్లో ఆందోళనచేపట్టారు.