“వీఆర్ఏల సమ్మెకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు”
వీఆర్ఏల సమ్మె 60వ రోజుకు చేరిన సందర్భంగా, దీక్షా శిబిరాన్ని సందర్శించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ధూళిపాళ ధనుంజయ నాయుడు
పెన్ పహాడ్. సెప్టెంబరు 22 (జనం సాక్షి) :
సమ్మె చేస్తున్న వీఆర్ఏలకు వ్యవసాయ కార్మిక సంఘం తన సంపూర్ణ మద్దతు ఇస్తుందని, ధనుంజయ నాయుడు అన్నారు.
వీఆర్ఏలకు పే స్కేలు ఇస్తామని 2017లో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్ సాక్షిగా ప్రకటించారని, ఆ తర్వాత అసెంబ్లీలో కూడా రెండు సందర్భాలలో పే స్కేలు ఇస్తామని వాగ్దానం చేసి తీరా ఇప్పుడు వారిని సమ్మెబాట పట్టించారని అన్నారు. సమ్మే విరమించండి ఆ తర్వాత మాట్లాడకుందామని కేటీఆర్ ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు వీఆర్ఏల న్యాయమైన కోరికలు అంగీకరించి వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
చనిపోయిన వీఆర్ఏ కుటుంబానికి 20 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు, రాష్ట్రవ్యాప్తంగా వెట్టి చాకిరీ చేస్తున్న వీఆర్ఏలకు కనీస వేతన చట్టం ప్రకారం నెలకు 21 వేలు వేతనం ఇవ్వాలని రాష్ట్రంలో వీఆర్వో వ్యవస్థ రద్దు చేశాక గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇతర ప్రజలకు అందుబాటులో ఉండి నిత్యం సేవలందించేది వీఆర్ఏ లని ప్రతి నెల మొదటి తారీకున వేతనం ఇవ్వాలని రెవెన్యూ వ్యవస్థలో క్షేత్రస్థాయిలో కీలకంగా పనిచేసేది వీఆర్ఏలు అన్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు అర్హత గల వీఆర్ఏలకు ప్రమోషన్స్, 55 సంవత్సరాల పైబడిన వారసులకు ఉద్యోగం ఉద్యోగ భద్రత పే స్కేల్ జీవో వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం
వీఆర్ఏల మండల అధ్యక్షుడు పట్టాన్ జానీ పాషా, ఉపాధ్యక్షుడు మధుసూదన్ ప్రధాన కార్యదర్శి పద్మ నాగయ్య కోషది కారి జాని పాష గౌరవ అధ్యక్షులు వెంకటయ్య ప్రభాకర్ నరేష్ వెంకన్న నర్సయ్య ,యాదగిరి,జానయ్య, బిక్కన్, రాణి, పిచ్చమ్మ ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
Attachments area