వీఆర్ఏ ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని…

చేవెళ్ల మండలం బీజేపీ అధ్యక్షులు పాండురంగా రెడ్డి..

చేవెళ్ల జూలై 30 (జనంసాక్షి) వీఆర్ఏ ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ చేవెళ్ల ఎమ్మార్వో అఫీస్ వద్ద తమ డిమాండ్ల సాధన కోసం దీక్ష చేస్తున్న వీఆర్ఏ లను ఈరోజు రాష్ట్ర బిజెపి నాయకులు చేవెళ్ల మండలం బీజేపీ అధ్యక్షులు పాండురంగా రెడ్డి గారు, మండల ప్రధాన కార్యదర్శి అతెల్లి అనంత్ రెడ్డి కలిసి వారికి మద్దతు తెలియజేస్తూ నల్ల బ్లాడ్జి లను నోటికి కట్టుకుని మౌన దీక్షలో పాల్గొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అనంతరం చేవెళ్ల మండలం బీజేపీ అధ్యక్షులు పాండురంగా రెడ్డి గారు  మాట్లాడుతూ వీఆర్ఏలందరికీ పేస్కేల్ ఇస్తామని, వయసు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తామని నిండు అసెంబ్లీలో 20 నెలల క్రితం సీఎం కేసీఆర్ ప్రకటించినా నేటికీ నెరవేరలేదని అన్ని అన్నారు. అర్హులైన వీఆర్ఎలకు వెంటనే పదోన్నతులు కల్పించాలని అన్నారు. విఆర్ఎ ల ఉద్యమం న్యాయమైనది. గ్రామ స్థాయి నుండి ప్రభుత్వ పరమైన ప్రతి సమస్య గుర్తించి ప్రభుత్వానికి తెలియచేయడంలో మీ పనితనం విలువైనది, అకస్మికంగా విఆర్ఎ లు ఎవరైనా మరణించినట్లయితే వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని, విఆర్ఎలలో అర్హులైన వారికీ వెంటనే ప్రమోషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.విఆర్ఎలకు వెంటనే పేస్కేలు అమలు చేసి వారి డిమాండ్లను పరిష్కరించాలి. వారి పోరాటానికి బీజేపీ పార్టీ మద్దతు ఉంటుందని ఆయన అన్నారు అంతే కాకుండా దళితులకు,రైతులకు, విద్యార్థి,నిరుద్యోగులకు ఇచ్చిన మాటలను మోసం చేయడంతో పాటు ఇప్పుడు ఉద్యోగస్థులను కూడా తీవ్ర ఇక్కట్లకు గురిచేస్తున్న ఈ దగాకోరు టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో గద్దె దింపి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. తెలంగాణ లో గ్రామ రెవెన్యూ సహాయకులు దాదాపు ఈరవై మూడు వేల మంది వున్నారు.ప్రభుత్వ రెవెన్యూ వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగులుగా వుంటు సమగ్ర కుటుంబ సర్వే నుండి నేటి దళిత బందు వరకు అనేక ప్రభుత్వ సర్వేలు, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు పోవడంలో వి ఆర్ ఏ లు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటించిన ప్రకారం పెస్కెల్,వారసులకు ఉద్యోగాలు,అర్హత కలిగిన వారికి ప్రమోషన్స్,తదితర డిమాండ్లను వెంటనే అమలు చేయాలని లేని యెడల ప్రభుత్వం దిగివచ్చే విధంగ అన్ని మండల,జిల్లా కేంద్రాల్లో పోరాటాలు చేస్తూ వారికి అండగా నిలుస్తామని అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి ,వెంకట్ రాంరెడ్డి, కృష్ణ గౌడ్, సత్యనారాయణ,అల్లడా అభిషేక్ రెడ్డి, శర్వలింగం, కుంచం శ్రీనివాస్. అదెట్ల శ్రీను, మాధుకర్ రెడ్డి, కృష్ణ మోహన్, మధుసూధన్ రెడ్డి ,కృష్ణ రెడ్డి,అంజన్, శ్రీకాంత్, విజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.