వీఆర్ఏ ల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్

కేసముద్రం ఆగస్టు 15 జనం సాక్షి / మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట తమ డిమాండ్ల సాధన కోసం దీక్ష చేస్తున్న వీఆర్ఏ లను సోమవారం కలిసి సంఘభావం ప్రకటించిన మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ .అనంతరం బలరాం నాయక్ మాట్లాడుతూ…ప్రగతి భవన్ సాక్షిగా విఆర్ఎలకు ఇచ్చి న హామీలను తక్షణమే నెరవేర్చాలని మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ అన్నారు. విఆర్ఎల చేపట్టిన సమ్మె 22వ రోజుకు చేరుకున్న సందర్భంగా మద్దత్తు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంను సీఎం కేసి ఆర్ నట్టేట ముంచారని విమర్శించారు.రెవెన్యూ వ్యవస్థను నీరుగార్చి అన్యాయం చేశారన్నారు. విఆర్ఎలకు ఇచ్చిన హామీలను నెరవేర్చి అర్హత కలిగిన విఆర్ఎలకు ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.55 ఏళ్ళు పై బడిన విఆర్ఎల స్థానంలో వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు నునావత్ రాధ,పీసీసీ సభ్యులు దసురు నాయక్,మండల అధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి,సింగల్ విండో బ్యాంక్ వైస్ చైర్మన్ అల్లం నాగేశ్వరరావు, కల్వల సర్పంచ్ గంట సంజీవ్ రెడ్డి,బండారు వెంకన్న ,హెచ్. వెంకటేశ్వర్లు,దన్నసరి ఎంపీటీసీ బాలు నాయక్,యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాణోత్ వెంకన్న నాయక్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి. తాజోద్దీన్,విక్కీ నాయక్,సంపత్,శ్రీను,ముకేశ్ తదితరులు పాల్గొన్నారు.