వీఆర్ఏ సమస్యలను పరిష్కరించే దాకా బీసీ సంఘం అండగా ఉంటుంది.
వీఆర్ఏ సమ్మెకు మద్దతు తెలిపిన బిసి కన్వీనర్ రాజ్కుమార్.
తాండూరు జులై 30(జనంసాక్షి)వీఆర్ఏల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గత ఆరు రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వీఆర్ఏలు సమ్మె లో భాగంగా శనివారం తాండూర్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద విఆర్ఓ ల సమ్మె ను తాండూరు నియోజకవర్గ బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి సాక్షాత్తు అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం వారి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో గత ఆరు రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేపడుతుంటే వీరి భయంతోనే కేసీఆర్ ఢిల్లీ పారిపోయారని ఎద్ధేవ చేశారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్న బిసి కులాలకు చెందినటువంటి వీఆర్ఏ ల ను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం తగదని వారు వీఆర్ఏలు సమ్మెలు చేయడానికి కూడా ఆర్థిక స్తోమత లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా వీళ్లని గుర్తించి వెంటనే పే స్కేల్ ఇవ్వాలని, వాళ్లు కోరుతున్న డిమాండ్లు పరిష్కరించాలని లేదంటే రాబోయే రోజుల్లో బీసీ సంఘం వారు కూడా వాళ్లకు మద్దతుగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ములకయ్య రైతు కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు బుగ్గప్ప మాట్లాడుతూ వీఆర్ఏలు కోరుతున్న న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే అన్ని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పూర్తి మద్దతు తెలుపుతూ సమ్మె ని మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ నాయకులు గడ్డం వెంకటేష్ తాండూరు నియోజకవర్గ బీసీ నాయకులు చంద్రశేఖర్ గుండు తాండూరు పట్టణ బీసీ యువజన సంఘం అధ్యక్షులు బోయ నరేష్, తాండూరు మండల బీసీ యువజన సంఘం అధ్యక్షులు బసంత్ కుమార్, యువ నాయకులు టైలర్ రమేష్ ,వీఆర్ఏల సంఘం అధ్యక్షులు చంద్రప్ప, అంజిలప్ప, మునిప్ప, జగదీష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.