వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి ఫిజికల్ ఫిట్నెస్ నిత్య జీవనంలో యోగా, వాకింగ్ ఒక భాగం:జిల్లా యెస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని

మెదక్ జిల్లా యెస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారి ఆదేశానుసారం ఏ.ఆర్ డి.ఎస్.పి శ్రీ.శ్రీనివాస్ గారి ఆద్వర్యంలో మెదక్ పట్టణ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో జిల్లాలోని సివిల్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్, హోంగార్డ్ సిబ్బందికి ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, నిర్వహించడం జరిగింది.
                ఈ సందర్బంగా యెస్.పి గారు మాట్లాడుతూ… ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని ప్రతిరోజు ఉదయాన్నే కనీసం ఒక అరగంట యోగ, ధ్యానం, నడక ఏదో ఒకటి చేయాలని, సాధ్యమైనంత వరకు బయట ఆహారం తినడం మానివేయాలని వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి క్రమశిక్షణ, యూనిటీ గా ఉండడం, ఫిజికల్ ఫిట్నెస్ కి ఉపయోగపడుతుందన్నారు. సిబ్బంది, అధికారులు వ్యాయామం చేయడం అనేది చాలా ముఖ్యం అని, మంచి శక్తి సామర్థ్యాలతో ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా విదులు నిర్వహించడానికి వీక్లీ పరేడ్, ఫిజికల్ ఫిట్నెస్ తప్పనిసరి అని అలాగే సమయం దొరికినప్పుడు వ్యాయామం చేయాలని ఫిట్నెస్ ను అనునిత్యం కాపాడుకోవాలన్నారు. పోలీసులు మంచి జీవన విధానాన్ని అవలంబించాలన్నారు. రెగ్యులర్ గా హెల్త్ చెక్ అప్స్ చేయించుకోవాలన్నారు. వ్యాయామాన్ని నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏ.ఆర్ డి.ఎస్.పి శ్రీ.శ్రీనివాస్ గారు,ఆర్.ఎస్.ఐ లు శ్రీ.నరేష్ గారు, భవానీ కుమార్ గారు, మహిపాల్ గారు, మరియు సిబ్బంది పాల్గొన్నారు.

తాజావార్తలు