వీపనగండ్లలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్

వీపనగండ్ల 20 (జనంసాక్షి) మండల కేంద్రంలో గురువారం నాడు శ్రీ  విజయ్ కుమార్ 99వ బెటాలియన్ కమాండెంట్ ఆదేశాల మేరకు కవాతు నిర్వహించినట్లు ఇన్చార్జి ఎస్ ఐ నాగన్న తెలిపారు. శ్రీ శశాంక్ శేఖర్ సహాయక కమాండెంట్ నేతృత్వంలో మరియు ఐ ఎన్ ఎస్ పి, టీఎస్ జె యు మరియు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఇతర సిబ్బంది మరియు వీపనగండ్ల పోలీస్ సిబ్బంది మండల కేంద్రంలో కవాతు నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా 15 రాపిడ్ యాక్షన్ బెటాలియన్ ఫోర్స్ సమస్యాత్మక ప్రాంతాలలో అత్యవసర సేవలు అందిస్తుందని విజయ్ కుమార్ కమాండెంట్ అన్నారు. జిల్లాలలోని అన్ని ప్రాంతాల చరిత్ర అవగాహన పెంచుకునేందుకు పట్టణాలలో కవాతు నిర్వహించామన్నారు. ఏ సమయంలోనైనా సమస్యాత్మక ప్రాంతాలలో మత ఘర్షణలు మరియు గొడవలు జరిగితే వెంటనే దిగిపోయి సమస్యలను మరియు శాంతి భద్రతలను కాపాడేందుకు ఎల్లప్పుడూ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ అందుబాటులో ఉంటుందని వారన్నారు. 99వ బెటాలియన్ రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సికింద్రాబాద్ రంగారెడ్డి నుండి రావడం జరిగిందని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఎస్ఐ నాగన్న ఏఎస్ఐ చంద్రారెడ్డి పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.