వీరప్పన్‌ అనుచరులకు తాత్కాలిక వూరట

మధ్యంతర నిలుపుదల ఉత్తర్వుల పొడిగింపు
ఆరువారాల తర్వాతే తీర్పు : సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : వీరప్పన్‌ అనుచరుల ఉరిశిక్షపై నిలుపుదలను సుప్రీంకోర్టు పొడిగించింది. ఫిబ్రవరి 18న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొనసాగించనుంది. మరో ధర్మాసనం ముందున్న కేసు విషయంలో తీర్పు వచ్చేవరకు ఈ కేసులో తీర్పు వెలువరించలేమని భారత ప్రధాన న్యాయమూర్తి అల్తమన్‌ కబీర్‌ అధ్యక్షతన ఈ కేసును పరిశీలించిన ధర్మాసనం పేర్కోంది. దాంతో కనీసం ఆరువారాలవరకూ ఉరిశిక్ష అమలయ్యే అవకాశం లేదు. 1993లో మందుపాతర పేల్చి 22 మంది పోలీసుల మృతికి కారకులైన వీరప్పన్‌ అనుచరులు నలుగురికి ఉరిశిక్ష పడిన సంగతి తెలిసిందే.