వూరంతా విద్యుదాఘాతం.. యువకుని మృతి

గజ్వేల్‌: మెదక్‌ జిల్లా గజ్వేల్‌ మండలం బేజుగాంలో వూరంతా విద్యుదాఘాతం చోటుచేసుకుంది. దీంతో మహేశ్‌గౌడ్‌
(18) అనే ఇంటర్‌ విద్యార్థి పంపుసెట్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తూ మృతి చెందాడు. ఉదయం నుంచి పలు నివాసాల్లో విద్యుత్‌
ఉపకరణాలను ముట్టుకుంటే షాక్‌ కొడుతుందని గ్రామస్థులు తెలిపారు. విద్యుత్‌ అధికారులు గ్రామానికి విద్యుత్‌ సరఫరా నిలిపివేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.