వృత్తి జీవితంలో సవాళ్లను స్వీకరించండి

5
– 2013 ఐఏఎస్‌ అధికారులకు మోదీ దిశానిర్దేశం

న్యూఢిల్లీ,  నవంబర్‌ 19 (జనంసాక్షి): వృత్తి జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. సుదీర్ఘకాలం ప్రజలతో సత్సంబంధాలు నెరపాల్సి ఉంటుందని… ముందుచూపుతో కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.  ఐఏఎస్‌ అధికారులు సర్వీసులో చేరిన తర్వాత మొదటి పది సంవత్సరాలు చాలా కీలకమని… ఈ సమయంలోనే సత్తా చాటాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దిల్లీలోని డీఆర్‌డీవోలో జరిగిన కార్యక్రమంలో 2013 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారులకు మోదీ మార్గనిర్దేశర చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టబోతున్న అధికారులు… వాళ్లేంటో సత్తా  నిరూపించుకోవాలన్నారు.  అధికారులు చేస్తున్న పనులకు దుష్టశక్తులు ఆటంకాలు సృష్టిస్తాయని… జాగ్రత్తగా ఉండాలన్నారు. చేసే పని నిజాయతీ, చిత్తశుద్ధితో చేయాలని సూచించారు. ప్రభుత్వం, సమాజం మధ్య అంతరాన్ని నాయకులే తొలగించలేరని… ప్రజలతో సత్సంబంధాలతో అధికారులు ఆ పని చేయొచ్చన్నారు. సమాజ బలోపేతం అనేది… ప్రభుత్వ బలోపేతంతో ముడిపడి ఉందన్నారు. జీవితంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుందని వివరించారు. సుదీర్ఘ కాలంలో ప్రజలతో సత్సంబంధాలు నెరపాల్సి ఉంటుందన్నారు. ముందు చూపుతో కార్యక్రమాలు చేపట్టాలని వివరించారు.అయితే క్షేత్రస్థాయిలో పరిశీలించే అంశాలు చాలా కీలకమన్నారు.  చేస్తున్న పనులకు దుష్టశక్తులు అడ్డుపడుతాయని వాటిని తిప్పి కొట్టాలని సూచించారు. చేసే పనిని నిజాయితీ, చిత్థశుద్ధితో నిర్వహించాలని కోరారు.