వృత్తి సబ్ రిజిస్ట్రార్… ప్రవృత్తి సామాజిక సేవా
ప్రభుత్వ అధికారి అంటే ఇలా ఉండాలి…
నిజాయితీకి మారు పేరు తస్లీమా…
ములుగు బ్యూరో,అక్టోబర్ 01(జనం సాక్షి):-
13 సంవత్సరాలుగా వృత్తినే దైవంగా భావిస్తూ, పేద ప్రజల బ్రతుకులలో వెలుగు నింపడం కోసం సామాజిక సేవ చేస్తూ ఎంతో మంది అనాధ, అభాగ్యులకు చేయూతనందిస్తున్నారు,వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పడం కోసం సెలవు రోజులలో వ్యవసాయం చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నారు.సబ్ రిజిస్ట్రార్ తస్లీమా తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సుపరిచితమైన పేరు తనదైన శైలిలో నిజాయితీగా,హుందాతనంతోప్రభుత్వ అధికారి అంటే ఇలా ఉండాలి అనిపించేలా ప్రజలలో చెరగని ముద్ర వేసుకున్న ఆఫీసర్ తస్లీమా.తస్లీమా 13 సంవత్సరాల ఉద్యోగ జీవితంలో ఎన్నో అవరోధాలు,మరెన్నో అటంకాలు,వాటన్నిటినీ లెక్క చేయకుండా,ఉద్యోగ ధర్మాన్ని అనుసరించి,ఆఫీసు పనిని సమర్థవంతంగా నిర్వర్తిస్తూ,ప్రభుత్వానికి,ప్ రజలకు మధ్య వారధిగా ఉంటూ,తన కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరితో అప్యాయతగ మాట్లాడి సకాలంలో పనిని పూర్తి చేసి అప్పగిస్తారు అనే బిరుదు ఆమె సొంతం,
విధి నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు చోటు ఇవ్వకుండా నిజాయితీతో పని చేయడంతో అటు ప్రజలలో,అధికారులలో మంచి పేరు సంపాదించుకున్నారు.13 సంవత్సరాల ఉద్యోగ వృత్తిలో 12 సార్లు ఉత్తమ అధికారిణిగా అవార్డు అందుకున్నారు.సబ్ రిజిస్ట్రార్ గా 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తస్లీమా మహ్మద్ కి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు..
Attachments area