వృద్ధురాలిపై దాడి.. బంగారం అపహరణ

మొయినాబాద్‌, మార్చి 25: మండలంలోని చిన్నమంగళాపురంలోని ఓ వృద్ధురాలిపై కొందరు దుండగులు బుధవారం ఉదయం దాడిచేశారు. ఆమె వద్దనున్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.