వృధాగా మిషన్ భగీరథ నీరు.. పైప్‌లైన్ల నుంచి లీకేజీ..

  పైపులో నుంచి నీరు లీకేజ్ అవుతున్న  దృశ్యం

గద్వాల ప్రతినిధి ‌అక్టోబర్ 17 (జనంసాక్షి):-  గద్వాల పట్టణంలోని 22వ వార్డులో చౌక ధర దుకాణం(రేషన్ షాప్)సమీపాన మిషన్ భగీరథ నీరు మురుగునిరు కాలువ పాలవుతోంది. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా… అధికారులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మిషన్ భగీరథ నీటి కోసం మిషన్ భగీరథ పైప్ లైన్ కనెక్షన్లు ఇచ్చారు. గత కొన్ని నెలల నుండి అన్ని పైప్ లైన్ కనెక్షన్ల నుండి నీరు లీక్ అవడంతో నీరు వృథాగా పోతున్నాయి. నీరు వృథాగా పోవడంతో పాటు నీరు కలుషితం అవుతూ రోడ్డుపై మురికి గుంతలు ఏర్పడి దోమలు పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని అధికారులు కౌన్సిలర్ దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. దోమలతో డెంగ్యూ ప్రబలి. కాలనీలో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు పట్టించుకోవాలని  వార్డు ప్రజలు కోరుకుంటున్నారు కోరుతున్నారు