వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
అనందగిరి గుట్టపై వెలిసిన లక్ష్మి సమేత వెంకన్న ఆలయ వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని ప్రత్యేక పూజలు చేసిన స్టేట్ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్వకుడు డాక్టర్ కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని అనందగిరి వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం స్వామి వారి తిరు కళ్యాణోత్సవంలో దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి, అవ అవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద పండితులు స్వామి వారి కళ్యాణాని కన్నుల పండువగా నిర్వహించి తలంబ్రాలు ఘటం తో ముగించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం తనవంత సహాయ సహాకారం అందిస్తానని ఆలయ అభివృద్ధి కమిటి సభ్యులకు తెలిపారు. రాబోయ్యే రోజుల్లో దిన దినాభివృద్ధి చెంది జిల్లాలో ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా నిలుస్తుందని ఆలయ అభివృద్ధి కమిటి సభ్యులను అభినందించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఉచిత అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటి చైర్మన్ కుబిరెడ్డి తిరుపతి రెడ్డి. ప్రధాన కార్యదర్శి కావలి నిరంజన్, కోశాధికారి కత్తె వెంకన్న, సభ్యులు కర్నాటి తిర పతయ్య, బత్తిని అమృత్ రెడ్డి, మలిశెట్టి వెంకటస్వామి, నగేష్, మధుసూదన్ రెడ్డి, నసీర్, రాజేందర్ గౌడ్, నెల్లికంటి గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.