వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్

మెల్బోర్న్: భారత్తో మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయానికి చేరువవుతున్న దశలో వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఫించ్ (97) సెంచరీ, స్మిత్ (47) హాఫ్ సెంచరీ చేజార్చుకున్నారు. షమీ.. స్మిత్ను, ఉమేష్ యాదవ్.. ఫించ్ను అవుట్ చేశారు. స్మిత్.. అశ్విన్కు, ఫించ్.. ధోనీకి దొరికిపోయారు. ముక్కోణపు సిరీస్లో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో 268 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆసీస్ 40.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.

ఆసీస్ స్కోరు 51 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. భారత్  పేసర్ ఉమేష్ యాదవ్.. వార్నర్ను అవుట్ చేశాడు. వార్నర్.. రైనాకు క్యాచిచ్చాడు. 115 పరుగుల వద్ద అక్షర్ పటేల్.. వాట్సన్ (41)ను బౌల్డ్ చేశాడు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన భారత్..  ఓపెనర్ రోహిత్ శర్మ(138) సెంచరీ, రైనా (51) హాఫ్ సెంచరీ చేయడంతో నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 267 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఆరు వికెట్లు తీసి భారత్ను కట్టడి చేశాడు.