వెలిమినేడు వద్ద రోడ్డు ప్రమాదం :ఒకరి మృతి

నల్గొండ, :  చిట్యాల మండలం వెలిమినేడు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందగా మరొకొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు వేగంగా వెళ్తూ ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహిళ మృతి చెందగా మరో పదిమందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.