వెస్టిండీస్ క్రికెట్ జట్టు..
భారత్ పర్యటన ఖరారు
– అక్టోబర్ 4 నుంచి తొలి టెస్టు ప్రారంభం
– రెండు టెస్టు, ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనున్న జట్లు
– హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో రెండో టెస్టు
ఆంటిగ్వా, ఆగస్టు30(జనం సాక్షి) : వెస్టిండీస్ క్రికెట్ జట్టు భారత్ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. అక్టోబర్ 4 తొలి టెస్టు మొదలు కానుండగా.. నవంబర్ 20న చివరి టీ20తో పర్యటన ముగియనుంది. గురువారం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు భారత్‌లో వెస్టిండీస్ పర్యటనను ఖరారు చేస్తూ పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ పర్యటనలో ఆతిథ్య భారత్‌తో వెస్టిండీస్ రెండు టెస్టులు, ఐదు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు హైదరాబాద్‌లో జరగనుంది. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ కోసం భారత్‌తో తలపడే జట్టును కూడా వెస్టిండీస్ ప్రకటించింది. 1948 నుంచి ఇప్పటి వరకు భారత్-వెస్టిండీస్ మధ్య 94 టెస్టులు జరిగాయి. ఇందులో 30 విజయాలు, 28 పరాజయాలు, 46 మ్యాచ్‌లను వెస్టిండీస్ డ్రాగా తన ఖాతాలో వేసుకుంది’ అని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధికారులు తెలిపారు. ‘ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో మెరుగ్గా రాణించిన జాసన్ ¬ల్డర్ జట్టుకు ముందుగా అభినందనలు. గాయం కారణంగా ఇటీవల కొన్ని సిరీస్‌లకు దూరమైన సునీల్ అంబ్రిస్‌తో పాటు జోమెల్ వర్రికన్ కూడా భారత పర్యటనకు వెళ్లే వెస్టిండీస్ జట్టులో చోటు దక్కించుకున్నారు’ అని వారు తెలిపారు.
టెస్ట్ సిరీస్‌కు వెస్టిండీస్ జట్టు వివరాలు..
జాసన్ ¬ల్డర్(కెప్టెన్), సునీల్ అంబ్రిస్, దేవేంద్ర బిషూ, బ్రాత్‌వైట్, రాస్టన్ ఛేజ్, షేన్ డౌరిచ్, గాబ్రియల్, హమిల్టన్, షాయ్ ¬ప్, హెట్‌మ్యార్, జోసెఫ్, కీమో పాల్, కీరన్ పొవెల్, రోచ్, వర్రికన్.
భారత్‌లో వెస్టిండీస్ పర్యటన..
మొదటి టెస్టు(రాజ్‌కోట్ – అక్టోబరు 4-8), రెండో టెస్టు (హైదరాబాద్ – అక్టోబరు 12-16). అదేవిధంగా తొలి వన్డే అక్టోబరు 21న గువాహటిలో, రెండో వన్డే అక్టోబర్ 24న ఇండోర్ లో, మూడో వన్డే అక్టోబర్ 27న పూణెలో, నాలుగో వన్డే అక్టోబర్ 29న ముంబయిలో, ఐదో వన్డే నవంబర్ 1న తిరువనంతపురంలో జరగనుంది. అదేవిధంగా తొలి టీ20 నవంబర్ 4న కోల్‌కతాలో, రెండో టీ20 నవంబర్ 6న లఖ్‌నవూలో, మూడో టీ20 నవంబర్ 11న చెన్నై లో జరగనుంది. అనంతరం సెప్టెంబరు 15 నుంచి 28 యూఏఈ వేదికగా ఆసియా కప్ జరగనుంది. ఆ తర్వాత భారత్ తన సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తలపడనుంది.