వేడుకగా యాదగిరి బ్ర¬్మత్సవాలు
నల్లగొండ,ఫిబ్రవరి26(జనంసాక్షి): యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్ర¬్మత్సవాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. గురువారం జగన్మోహినీ అవతారంలో భక్తులకు లక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చారు. మాడవీధుల్లో కోలాటాలు, భజనలు ఆకట్టుకున్నాయి. ఈ రోజు రాత్రికి స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోళ్ల మ¬త్సవం ఉంటుంది. శుక్రవారం రాత్రి అతి విశిష్టమైన కల్యాణమ¬త్సవం ఉంటుంది. స్వామివారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. అత్యంత ప్రాధాన్యం కలిగిన తిరుకల్యాణ మ¬త్సవం శుక్రవారం రాత్రి జరుగుతుంది. లోక కల్యాణార్థమై ఏటేటా జరిగే ఈ తిరు మ¬త్సవంలో స్తంభోద్భవుడైన ఉగ్రుడు గజవాహనంపై కల్యాణోత్సవ ప్రాంగణానికి భక్త జనుల మధ్య చేరుతారు. శ్రీస్వామి వెంటే ముత్యాల పల్లకిపై అమ్మవారు విచ్చేస్తారు. విష్వక్సేన ఆరాధనతో తిరుకల్యాణ పర్వం మొదలవుతుంది. ఆ రోజు మధ్యాహ్నం హనుమంత వాహనంపై శ్రీస్వామి ఊరేగుతారు. కల్యాణ్ఠత్సవంలో రాష్ట్ర ప్రభుత్వం, తితిదే నుంచి శ్రీస్వామి అమ్మవారలకు పట్టు వసౄలు అందజేస్తారు. అర్ధరాత్రి వరకు మ¬త్సవం కొనసాగుతుంది. జాతరలో భక్తలను ఆశీర్వదించే బరాత్(రథోత్సవం) పర్వం శనివారం రాత్రి 10 గంటలకు మొదలవుతుంది. భక్తులకు బహిరంగంగా దర్శనమిచ్చేలా కల్యాణ మూర్తులు వూరేగే పర్వాన్ని శాసౄక్తంగా చేపడతారు. తొలుత దివ్య విమాన రథానికి సంప్రదాయ పూజలు చేపట్టి, రథ చక్రాలను కదిలిస్తారు. శ్రీస్వామి వూరేగింపులో పాల్గొనేందుకు భక్త జనులు అత్యంత ఉత్సాహాన్ని కనబరుస్తారు. ముఖ్యంగా యువత అధికంగా రథోత్సవంలో పాల్గొంటారు.