వేతనాలు చెల్లించాలని కార్మికుల ధర్నా
ఖమ్మం (కార్పొరేషన్) : నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులకు రెగ్యులర్ కార్మికులతో సమానంగా వేతనాలు చెల్లించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ ధర్నాలో సీఐటీయూ నాయకులు రమేశ్, విష్ణు మాట్లాడుతూ పనిభారం ఒకేలా ఉంటున్నా వేతనాల చెల్లింపులో వ్యత్యాసం ఉండటం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. పదిరోజుల్లో నిర్ణయం తీసుకోకపోతే నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు.