వేతనాల కోసం సీఆర్పీల వినతి
ఆదిలాబాద్ విద్యావిభాగం న్యూస్‌టుడె. వేతనాలు.ప్రత్యేక భత్యాలు చెల్లించాలని కోరుతూ బుదవారం రాజీవ్‌విద్యామిషన్ పీవో వెంకటయ్యకు క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు వినతిపత్రం అందజేశారు .జిల్లాలో 256 మందిసీఆర్పిలు పనిచేస్తున్నామని తెలిపారు.నవంబర్ డిసెంబర్ వేతనాలు రావల్సి ఉందని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం తామే జేబులో నుంచి డబ్బులు పెట్టుకుని ప్రయాణాలు చేస్తూ ఉన్నతాదికారులకు నివేదికలు అందజేస్తున్నామని చెప్పారు.సమావేశాలకు వచ్చినపుడు కనీసం టీ,ఏ డీఏ లు కూడా చెల్లించడం లేదని ఆవేధన వ్యక్తంచేశారు. అధికారులు ఇప్పటికైన తమకు బకాయి వేతనాలు ఇతర భత్యాలు చెల్లించాలని విన్నవించారు ఈకార్యక్రమంలో సీఆర్పీల సంఘం జిల్లా అద్యక్ష .కార్యదర్శులు రవికుమార్ ప్రశాంత్‌రెడ్డి ఉపాద్యక్షులు పిరవిందర్ పి భానుప్రకాష్ నాయకులు తేజస్విని లక్ష్మి ముబారక్ రాజు వినోద్ నాగారపు అరవింద్ తదితరులు పాల్గోన్నారు.