వేములవాడ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తా
జనం సాక్షి, కథలాపూర్
వేములవాడ నియోజకవర్గం అభివృద్ధిలో ముందు ఉంచుతానని ఆధ్యా గోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్ బుధవారంవిలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా గోలి మోహన్ మాట్లాడుతూ 2001 నుండి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న వ్యక్తి ని అని, ఆధ్యా ఫౌండేషన్ ద్వారా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించాలని ఫౌండేషన్ను ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతి మండలానికి యువతకు ఉపాధి చేకూర్చే విధంగా జాబ్ 200 మంది యువతకు ఉపాధి కల్పించే విధంగా ఆలోచింపజేస్తున్నామని, యువత రాజకీయాల్లో ముఖ్యమైన పాత్ర పోషించాలని కోరారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరికి ఆపద వచ్చిన నా వంతు కృషి చేస్తానని అన్నారు. బడుగు బలహీన వర్గాలను ముందంజలో ఉంచాలని నద్వేయమని అదేవిధంగా లక్ష్యం వైపు యువత ఉండాలని దిశ నిర్దేశాలు చేశారు, వేములవాడ నియోజకవర్గం లో అహర్నిశలు కృషి చేస్తానని ప్రజలు ముందుండి నన్ను నడిపియాలని కోరారు. అనంతరం తండ్రియాల గ్రామంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో ఎంపీపీ వైస్ గండ్ర కిరణ్ రావు, పిఎసిఎస్ చైర్మన్ గంగాధర్, ఉప సర్పంచ్ జవ్వాజి శ్రీను, బద్దం గంగారెడ్డి, మిట్టపల్లి గంగారెడ్డి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు