వేములవాడ రాజన్నను దర్శించుకున్న విజయశాంతి
ఏటా ఇస్తానన్న వందకోట్లు ఏమయ్యాయని ప్రశ్న
వేములవాడ,ఫిబ్రవరి26(జనం సాక్షి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని బీజేపీ మహిళానేత విజయశాంతి శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి విజయశాంతి ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న ఆలయానికి ఏటా ఇస్తానన్న వంద కోట్ల నిధుల హావిూపై బీజేపీ దీక్షకు శ్రీకారం చుట్టింది. స్వామి దర్శనం అనంతరం విజయశాంతి దీక్షలో పాల్గొన్నారు. కేసీఆర్ ధర్మానికి విరుద్ధంగా వెళ్తున్నారని విజయశాంతి అన్నారు. ఏటా రాజన్న ఆలయానికి వంద కోట్లు ఇస్తామని కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. కేసీఆర్ రాక్షసుడు.. దేవాలయం అభివృద్ధి కావడం ఇష్టం లేదన్నారు. వేములవాడ ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. సారు జర్మనీలో కూర్చున్నారని పరోక్షంగా ఎమ్మెల్యే రమేశ్‌ను యెద్దేవా చేశారు. కేసీఆర్ హిందువు కాదా? కేసీఆర్ ఏమైనా ముస్లీమా…క్రిస్టియనా … హిందుగాళ్ళు బొందుగాళ్ళు అనడానికి నీకు నోరెలా వచ్చిందని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రజలతో పాటే దేవుళ్ళనూ మోసం చేస్తున్నారన్నారు. శివుడు మూడో కన్ను తెరుస్తారని.. కేసీఆర్‌ను భస్మం చేస్తాడని విజయశాంతి వ్యాఖ్యలు చేశారు.