వేరుశనగ విత్తన పంపిణీ

అనంతపురం,జూన్‌5(జనం సాక్షి): అనంతపురం జిల్లాలో ప్రధాన వర్షాదార పంట వేరుసెనగ. ప్రభుత్వం 40 శాతం రాయితీతో ఇచ్చే వేరుసెనగ కాయల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. దీంతో అనంత మార్కెట్‌ యార్డులో రైతులు తరలివస్తున్నారు. ఎండలోనే తాగునీరు ఉంచడంతో ఇబ్బందులు పడ్డారు. ఎక్కడా ప్రథమ చికిత్స కేంద్రం కనిపించలేదు. కాయల పంపిణీ కేంద్రం వద్ద వర్షం రావటంతో బురదమయంగా మారింది. హమాలీలు డబ్బు ఎక్కువగా వసూళ్లు చేస్తున్నారని రైతులు కొందరు వారిపైతిరగబడ్డారు. బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేయడంతో అవకతవకలకు అడ్డుకట్ట వేసినట్లయింది. ఒకపక్క వర్షం కురుస్తుండటం.. పంపిణీ ప్రారంభం కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

—————