వేలేత్తి చూపే ముందు ఆత్మ విమర్శ చేసుకోండి:బీజేపీపై సోనియా విమర్శలు
మాండి: అవినీతి ఊబిలో లోతుగా కూరుకుపోయిన బీజేపీ అవినీతికి వ్యతిరేఖంగా పోరాడుతున్నట్లు పటాటోపం ప్రదర్శిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. హిమచల్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారాన్ని బుధవారం ప్రారంభించిన ఆమె ఆ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ఓ వైపు అవినీతిలో కూరుకు పోయి మరో వైపు దాన్ని ఎదుర్కొనే విషయం మాట్లాడుతున్నారు. వారు చేస్తున్నట్లు చెబుతున్న అవినీతి వ్యతిరేక పోరాటం ఒట్టి పటాటోప ప్రదర్శన ఒకరి వైపు వేలేత్తి చూపే ముందు వారు ఆత్మ విమర్శ చేసుకోవాలి అన్నారు. సమాచార హక్కు చట్టాన్ని తెచ్చిందెవరు.? బీజేపీనా.? అవినీతిని నిలువరించడానికి యూపీఏ తీసుకోచ్చింది అని చెప్పారు.