వేసవిలో మంచినీటి ఎద్దడి నివారించాలి

నల్లగొండ,మార్చి3(జ‌నంసాక్షి): మంచినీటి కోసం వినియోగిస్తున్న చెర్వుల్లో నీరు లేక కృష్ణాజలాల సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని టిడిపి నేతలు తెలిపారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలోని చెర్వులను నింపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలోని చెర్వులు నింపి మంచినీటి ఇబ్బందులను తొలగించాలని.. వేసవిలో నీటి సమస్యరాకుండా చర్యలకు ఆదేవించాలని వారు కలెక్టర్‌ను కోరారు. సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ  కలెక్టర్‌కు వినతి పత్రంలో కోరారు. వేసవితో జిల్లాలో మంచినీటి సమస్యలు ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తోందని వివరించారు.