వైఎస్ హయాంలోనే ఎక్కువ ప్రాజెక్టులు పూర్తి
ప్రత్యేక హోదాతోనే ఎపికి మనుగడ: ఎంపి అవినాశ్
న్యూఢిల్లీ,జూన్7(ఆర్‌ఎన్‌ఎ): ప్రత్యేకహోదాపై కేంద్రంతో పోరాటం చేస్తున్నది కేవలం వైకాపా మాత్రమేనని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిని తక్కువ చేసి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పేర్కొన్నారు. విభజన చట్టంతో పోలవరం ప్రాజెక్టును చేర్చి, కేంద్ర ప్రభుత్వమే ప్రాజెక్టునిర్మాణ పూర్తి బాధ్యతలు చేపట్టాలని విభజన చట్టంలోనే ఉందన్నారు. నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దాదాపు రూ. 5వేల 500కోట్ల రూపాయల ప్రాజెక్టు పనులు చేపట్టారన్నారు. రూ.16వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు నిర్మాణ అంచనాలను రూ.43 వేల కోట్లకు పెంచుకొని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జల యజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి తన అనుయాయులకు ప్రజాధనాన్ని దోచి పెడుతున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు వైఎస్ హయాంలో దాదాపు 80 నుంచి 90 శాతం పూర్తయిన విషయం చంద్రబాబు మరచిపోయారని ఎద్దెవా చేశారు. దివంగత సీఎం వైఎస్‌ఆర్ హయాంలో ప్రారంభమైన ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఒక్క జగన్‌తోనే సాధ్యమన్నారు. 2009లో వైఎస్‌ఆర్ మరణానంతరం జిల్లాలోని ప్రాజెక్టుల పనులు ఆగిపోయాయన్నారు. 2009నుంచి 2017 వరకు ప్రాజెక్టులకు కేవలం ముష్టిగా నిధులు కేటాయించడంతో అవి నేటికి పూర్తి దశకు చేరుకోలేదన్నారు. పులివెందుల ప్రాంతంలోని పైడిపాలెం ప్రాజెక్ట్‌కు 6 టీఎంసీలు, సీబీఆర్‌కు 8 టీఎంసీల నీరు వస్తే.. 1.40లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే సాగులోకి వస్తుందన్నారు. వైఎస్‌ఆర్ ప్రవేశపెట్టిన మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా బిందు, తుంపర సేద్య పరికరాలు రైతులకు ఉచితంగా అందిస్తే మరో 60వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వవచ్చునన్నారు. దివంగత వైఎస్‌ఆర్ మోడల్ ప్రాజెక్ట్‌గా రూపొందించడానికి మొదటి విడతలో 25వేల ఎకరాలకు సంబంధించి పనులు పూర్తి చేశారన్నారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్ పూర్తయితే సాగు,తాగునీటికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఆ దిశగా ప్రతి కార్యకర్త 2019లో జరిగే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చే విధంగా ఇప్పటినుంచే కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక¬దా సాధించేంతవరకు వైఎస్సార్ కాంగ్రెస్ పోరాటం సాగిస్తూనే ఉంటుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ పచ్చచొక్కాల పరమవుతున్నాయని కడప ఎంపీ విమర్శించారు. చంద్రబాబు అమలు చేసిన పథకాలు అధికార పార్టీవారికే చేరుతున్నాయని అన్నారు. ఎన్నికల హావిూల్లో ఏ ఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి ఊసే లేదన్నారు. బీజేపీ, టీడీపీ నాయకులు ప్రత్యేక ¬దా విషయంలో మాట తప్పారన్నారు. ఎన్నికల అనంతరం ప్రత్యేక ¬దాను తుంగలో తొక్కి స్వార్థ ప్రయోజనాల కోసం సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ జపం చేస్తూ మరోసారి ప్రజలను మోసం చేశారన్నారు. ప్రత్యేక ¬దా కోసం వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ప్రత్యేక ¬దా ద్వారా మాత్రమే సాధ్యమని అన్నారు. అందువల్ల రాబోయే ఎన్నికల్లో 175ఎమ్మెల్యే, 25ఎంపీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తే.. సీఎం ¬దాలో వైఎస్ జగన్ కేంద్రం మెడలు ఒంచి ప్రత్యేక ¬దా సాధించుకునే అవకాశం ఉందన్నారు.