వైకాపా నిరసన దీక్ష విడ్డూరం : తులసిరెడ్డి

హైదరాబాద్‌ : జగన్‌ అరెస్టయ్యి ఏడాదైన సందర్భంగా వైకాపా నిరసన దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి అన్నారు. వైకాపా నాయకుల వికృత చేష్టలు చూస్తుంటే వారికి కోర్టులన్నా, చట్టాలన్నా, రాజ్యాంగం అన్నా కనీస గౌరవం లేదని అక్షేపించారు. కేవలం అరాచకవాదమొక్కటే వైకాపా సిద్ధాంతమని విమర్శించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అరాచక చర్యలను గ్రహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.