వైకాపా మునిగిపోయే నావ

గేట్లు తెరవకుండానే టిడిపిలోకి వలసలు
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్య
విశాఖపట్నం,ఆగస్ట్‌29(జనంసాక్షి): వైకాపా మునిగిపోయే నావ అని తెదేపా ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. విశాఖపట్నంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నివాసంలో గంటా విూడియాతో మాట్లాడారు. పరిస్థితి చూస్తుంటే వైకాపాలో జగన్‌ తప్ప ఎవరూ మిగిలేట్లు లేరని వ్యాఖ్యానించారు. ఆ పార్టీలో ఈ పరిస్థితికి జగనే కారణమన్నారు. వైకాపా నేతలు తమ పదవులకు రాజీనామా చేసి తెదేపాలో చేరతామంటే స్వాగతిస్తామని గంటా చెప్పారు. ఒకప్పుడు అధికారంలో
ఉన్నప్పుడు వైసీపీ అధినేత చేసిన సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. మేము కానీ గేట్లు ఎత్తేస్తే టీడీపీప పూర్తిగా ఖాళీ అవుతుందంటూ సవాళ్లు విసిరేవారు. ఇప్పుడు అదే డైలాగ్‌ను మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు జగన్‌కు అప్పజెప్పారు. తాము గేట్లు ఎత్తేస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని గంటా తెలిపారు. ఇవాళ ఇద్దరు ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్‌ రావులు తమ పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గంటా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో వైసీపీ మునుగుతున్న నావ అని అన్నానని.. అది ఇప్పుడు మునిగిపోయిన నావ అని ఎద్దేవా చేశారు.
వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మా పార్టీలోకి రావడానికి వరదలాగా సిద్ధంగా ఉన్నారన్నారు. ఇలా పార్టీలోకి వచ్చిన వారు.. తమ పదవులకు రాజీనామా చేసి రావాలని తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పారని గంటా అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి వచ్చిన వారిని స్వాగతిస్తామని పేర్కొన్నారు. మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్‌, పోతుల సునీత.. తమ పదవులకు రాజీనామా చేశారని.. మిగిలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూడా వైసీపీని వీడుతారని గంటా జోస్యం చెప్పారు. ఆ పార్టీలో జగన్‌ ఒక్కరే మిగులుతారన్నారు. వైసీపీ ఈ దుస్థితికి కారణం ముమ్మాటికి ఆ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా జగన్‌ మోహన్‌ రెడ్డి తన వ్యక్తిత్వాన్ని, తీరును మార్చుకోవాలని గంటా హితవు పలికారు. అలా చేస్తే కనీసం వచ్చే ఎన్నికలు నాటికైనా వైసీపీకి ప్రతిపక్ష హోదా వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి రెండు నెలలు కాకముందే.. రాష్ట్ర పతి పాలన పెట్టమనడం ఏమిటని ్గªర్‌ అయ్యారు. జగన్‌ మానసిక పరిస్థితి బాగోలేదని ఆయన చెల్లెలు షర్మిల చెప్పారని గంటా పేర్కొన్నారు.