*వైద్యం వికటించి శిశువు సహా తల్లి మృతి డాక్టర్లు లేకపోవడంతో నర్సుల నిర్లక్షమే మృతికి కారణమని బాధిత కుటుంబీకుల ఆరోపణ*
నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం వికటించి శిశువు మరియు బాలింత మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే మద్దూరు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కృష్ణవేణి అనే నిండు గర్భిణీ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి వచ్చారు. అక్కడే పురిటినొప్పులు రావడంతో హాస్పత్రిలో సమయానికి డాక్టర్స్ లేకపోవడంతో స్టాఫ్ నర్సులు కాన్పు చేసేందుకు ప్రయత్నించగా వైద్యం వికటించి తీవ్ర రక్త స్రావంతో శిశువుతో సహా బాలింత మృతి చెందింది. ఈ సందర్భంగా స్టాఫ్ నర్సులు నిర్లక్షమే మృతికి కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు..