వైద్యుడి నిర్లక్ష్యంతో రోగి మృతి
పాల్వంచ : కడుపులో మంటగా ఉందని వైద్యుడి దగ్గరకు వెళ్లిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పాల్వంచలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. వివరాల్లోకి వెళ్తే…. స్థానికంగా గాంధీనగర్ ప్రాంతానికి చెందిన చెరుకూరి రామారావు(40) కడుపులో మంటగా ఉండడంతో ప్రసాద్ క్లినిక్‌కు వెళ్లాడు. అక్కడి వైద్యుడు ప్రసాద్.. రామారావుకు ఇంజెక్షన్ ఇచ్చి, మందులు రాసిచ్చారు. అయితే ఆ తర్వాత 10 నిముషాలకే రామారావు ఆస్పత్రిలోనే కుప్పకూలిపోయాడు. అతడు మృతి చెందినట్టు వైద్యుడు ధ్రువీకరించారు. కాగా వైద్యుడి నిర్లక్ష్యం వల్లే రామారావు మృతి చెందినట్టు అతని బంధువులు ఆరోపిస్తున్నారు.