వైద్యుల నిర్లక్ష్యం తో మహిళ మృతి

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి ముందు మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.