వైభవంగా అయ్యప్ప పదునెట్టంబడి మహా పడిపూజ

హాజరైన రాజేశ్వర గురుస్వామి
శివ్వంపేట నవంబర్ 30 జనంసాక్షి : కలియుగ ప్రత్యక్ష దైవం, హరిహరుల ముద్దుల తనయుడు, అయ్యప్ప స్వామి పదునెట్టాంబడి మహా పడిపూజ రామ్ రెడ్డి బావి గ్రామానికి చెందిన అంజిరెడ్డి మాలాధారణ చేసిన  గురు స్వామి నివాసంలో బుధవారం  అయ్యప్ప స్వామి పదునెట్టాంబడి  మహా  పడిపూజ వైభవంగా జరిగింది. ఈ పడిపూజలో భాగంగా మొదటగా గణపతి పూజ, సుబ్రహ్మణ్య స్వామి పూజ ఆ తదుపరి అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం, పసుపు,కుంకుమ, చందన భస్మ అభిషేకం, వివిధ పళ్ళ రసాల అభిషేకం, ఆ తదుపరి పడి పాటతో పడిపూజ చేపట్టారు.  ఈ పదునెట్టాంబడి మహా పడిపూజ మేడ్చల్ అయ్యప్ప స్వామి దేవస్థానం  రాజేశ్వర గురుస్వామి, అలాగే  రామ్మూర్తి, ఆనంద్, శ్రీకాంత్, పద్మా రెడ్డి, మైపాల్ రెడ్డి, దామోదర్ రెడ్డి, నాగేందర్, నాగభూషణం  గురుస్వామూల ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది.  అనంతరం మంగళహారతి మంత్రపుష్పాలు పాటించారు. ఈ పూజాదికాలల్లో అయ్యప్ప భక్తి సంకీర్తనలు ఆలపిస్తూ, శరణు ఘోషలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. చివరగా పడిపూజకు అయ్యప్ప స్వాములతో పాటు సాధారణ భక్తులు కూడా  పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థ ప్రసాద స్వీకరించారు. ఆ తర్వాత  పూజలకు హాజరైన అయ్యప్ప స్వామి భక్తులకు, మాలదరణ స్వాములకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో నీలం మధు కన్నె స్వామి, సికింద్లాపూర్ సర్పంచ్ కత్తి స్వామి సుధాకర్ రెడ్డి, గురు స్వాములు చెన్నాపూర్ ఆంజనేయులు, శివ్వంపేట గురుస్వాములు వజ్జ శ్రీనివాస్, వజ్జ, సత్యనారాయణ, సత్యనారాయణ గౌడ్, ఇసుగారి అరుణ్, ఇసుగారి మల్లెష్, ఇసుగారి రమేష్, వజ్జరాజు, వజ్జ హరీష్, వజ్జ నాగరాజు, వజ్జ ప్రవీణ్, వజ్జ నిరంజన్, మీయ్యడి నాగరాజు,  యాదగిరి, చందు, వంశీ, మధు, నర్సాపూర్ రాజు, మహేష్, అజయ్, మంబాపూర్ శీను, ప్రశాంత్, రేవంత్, ప్రసాద్, రాము, శ్యామ్, నవీన్,  సాయి, హరికృష్ణ, విజయ్ సందీప్, కాంలేగారి శీను లతోపాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.