వైభవంగా ప్రారంభంమైన అతిరాత్ర మహాయాగం
కీసర: ప్రపంచ శాంతి, ప్రకృతి సమతుల్యం, లోకకల్యాణార్థం అతిరాత్రి మహాయాగం సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన కీసరగుట్టలో ఈ రోజు వైభవంగా ప్రారంభమైంది. దాదాపు 23ఎకరాల సువిశాల ప్రదేశంలో యాగశాలను నిర్మించారు. బ్రహ్మశ్రీ చెరుముక్క వల్లభన్ సోమయాజి ఆధ్వర్యంలో కేరళ నుంచి విచ్చేసిన దాదాపు 100మంది నంబూద్రిలు ఈ యాగ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ యాగం 12రోజుల పాటు నిర్వహించనున్నారు. మొదటిరోజైన శనివారం మంత్రి ప్రసాద్‌కుమార్, ఎమ్మెల్యే , కె.లక్ష్మారెడ్డి, జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ జంటనగడరాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.