వైభవంగా ‘మూలా’ మహోత్సవం
వర్గల్ (జనంసాక్షి):- చదువుల తల్లి కొవెల మంగళవారం మూల మహోతంసవ వేడుకలతో అలరారింది. తన జన్మ నక్షత్రం రోజున విద్యాసరస్వతి అమ్మవారు విశేషాలంకారణలో భక్తులకు సాక్ష్యాత్కరింఆరు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి వైఔభవం తిలకించి భక్తులు పరవిశించారు. ఆలయ పురోహితులు బాల ఉమామహేశ్వర శర్మ, వేదపండితులు అనంతగిరి శర్మ, శశిధర శర్మల నేతృత్వంలో ఉధయం 5.30 గంటలకు గణపతి పూజతో మూలా మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. అనంతరం అమ్మవారికి విశేష పంచామృత అభిషేకం నిర్వహించిరు. పట్టు వస్త్రాలు, పూల మాలికలు, సకల ఆభరణలతో సర్వాలంకర శోభితులను చేశారు. వేదోక్తంగా సప్త శతి పారాయణాలు చేసారు. అమ్మవారికి కుంకుమార్చనలు జరిపారు. మరోవైపు ఆలయ యాగ మండపంలో చండీయాగం శాస్త్రోక్తంగా కొనసాగింది. నేత్రదపరర్వంగా సాగిన ఈ మహోత్స వేడుకలు తిలకించి, అమ్మవారి దివ్య ంగళ రూపం దర్శించుకుని భక్త జనులు తరించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అమ్మ సన్నిదిలో పీఆర్ ఎస్‌ఈ వెంకటేశ్వర్‌రావు:-
మూలా నక్షత్రం రోజున నిర్వహించిన వేడుకల్లో జిల్లా సంచాచితీరాజ్ విభాగం సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటేశ్వర్‌రావు, గజ్వేల్ డిన్యూటీ ఈఈ చంద్రమౌళి పాల్గోన్నారు. విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకోని తరించారు. ఈ సందర్భంగా ఆలయం తరుపున మేనేజర్ రఘుపవన్‌రావు వారికి శేష వస్త్రాన్ని అందజేశారు. వారి వెంట మాజీ ఎంపీపీ మోహన్, వర్గల్, ములుగు ఏఈలు రఘు, అంజిరెడ్డి ఉన్నారు.