వైభవంగా శ్రీరాముని పట్టాభిషేకం
ఖమ్మం జిల్లా భద్రాచలంలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం ముగిసింది. శ్రీరాముడిని మహారాజ కిరీటంతో పట్టాభిషిక్తుడిని చేశారు. భద్రాద్రి ఆలయ ప్రాంగణంలోని మిథిల మండపంలో పట్టాభిషేక మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నిన్న సీతారాముల కల్యాణం చూడడానికి వచ్చిన అనేక మంది భక్తులు పట్టాభిషేక మహోత్సవంలోనూ పాల్గొన్నారు. వేల మంది భక్తులు ఈ వేడుకను వీక్షించారు.