వైమానిక విమానం గల్లంతు
– విమానంలో ఆరుగురి సిబ్బందితో సహా 29 మంది ప్రయాణికులు
– ముమ్మరంగా గాలింపు చర్యలు
చెన్నై,జులై 22(జనంసాక్షి):తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబరం నుంచి అండమాన్ రాజధాని పోర్టుబ్లెయిర్ వెళ్తూ గల్లంతైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్-32 విమానం కోసం గాలింపుఇంకా కొనసాగుతోంది. గాలింపు చర్యల్లో 13 యుద్ధనౌకలు, 5 యుద్ధ విమానాలు, ఓ జలాంతర్గామి పాల్గొంటున్నాయి.శుక్రవారం ఉదయం 7.30 గంటలకు తాంబరం ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన విమానానికి ఉదయం 9.12 గంటల సమయంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. చెన్నైకి 200 నాటికల్ మైళ్ల దూరంలో ఉండగా విమానం ఆచూకీ గల్లంతైనట్లు నేవీ అధికారులు చెబుతున్నారు.విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 29 మంది ఉన్నారు.8 మంది విశాఖ వాసులు గల్లంతైన ఏఎన్-32 విమానంలో 8 మంది విశాఖ వాసులు ఉన్నట్లు సమాచారం. విమానంలో ఎన్‌ఏడీలో ఛార్జ్‌మెన్ సాంబమూర్తి, ఆర్మమెంట్ ఫిట్టర్స్ ప్రసాద్‌బాబు, నాగేంద్రరావు, సేనాపతి, మహారాణా, చిన్నారావు, మల్టీ టాస్కింగ్ సిబ్బంది శ్రీనివాసరావు ఉన్నారు. గల్లంతైన వారి కుటుంబాలకు నౌకాదళ అధికారులు సమాచారమిచ్చారు.రష్యాకు చెందిన ఏఎన్-32 రకం విమానాలను భారతీయ వాయుసేన 1984 నుంచి ఉపయోగిస్తోంది. ఈ రకానికి చెందిన 125 విమానాలు వాయుసేన వద్ద ఉన్నాయి. ఇవి ఎలాంటి వాతావరణ మార్పులు తలెత్తినా, రీఫ్యుయెలింగ్ చేయకపోయినా నాలుగు గంటల వరకు ప్రయాణిస్తాయి. ఇవి చాలా ధృడంగా ఉంటాయని, అందువల్ల వీటిని ఎక్కువగా కొండ ప్రాంతాలకు, ఎడారులకు పంపించేందుకు వాడుతుంటారని విశ్రాంతవైమానికదళ అధికారి ప్రఫుల్ బాక్షి తెలిపారు.
గాలింపు చర్యలు ముమ్మరం
తమిళనాడు రాజధాని చెన్నైలోని తాంబరం నుంచి అండమాన్ పోర్టుబ్లెయిర్ వెళ్తూ గల్లంతైన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏఎన్-32 విమానం కోసం గాలింపు ముమ్మరం చేశారు. గాలింపు చర్యల్లో 13 యుద్ధనౌకలు, 5 యుద్ధ విమానాలు, ఓ జలాంతర్గామి పాల్గొంటున్నాయి. శుక్రవారం ఉదయం 7.30 గంటలకు తాంబరం ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన విమానానికి ఉదయం 8.12 గంటల సమయంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానం కూలిపోయిందా లేదా దారి మళ్లిందా అన్న కోణంలో వైమానిక దళ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతైన విమానంలో ఆరుగురు సిబ్బంది సహా 29 మంది ఉన్నారు. బంగాళాఖాతంలో గాలింపు చేపట్టారు. ఇందుకోసం రాడార్లను, జలాంతర్గామిని కూడా ఉపయోగిస్తున్నారు. రష్యాకు చెందిన ఏఎన్-32 రకం విమానాలను భారతీయ వాయుసేన 1984 నుంచి ఉపయోగిస్తోంది. ఈ రకానికి చెందిన 125 విమానాలు వాయుసేన వద్ద ఉన్నాయి. ఇవి ఎలాంటి వాతావరణ మార్పులు తలెత్తినా, రీఫ్యుయెలింగ్ చేయకపోయినా నాలుగు గంటల వరకు ప్రయాణిస్తాయి. ఇవి చాలా ధృడంగా ఉంటాయని, అందువల్ల వీటిని ఎక్కువగా కొండ ప్రాంతాలకు, ఎడారులకు పంపించేందుకు వాడుతుంటారని విశ్రాంతవైమానికదళ అధికారి ప్రఫుల్ బాక్షి తెలిపారు.