వొడాఫోన్ ఇండియా కొత్త సీవోవోగా నవీన్చోప్రా
హైదరాబాద్ జనంసాక్షి : వొడాఫోన్ ఇండియా ఛీప్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా నవీన్చోప్రా నియమితులయ్యారు. ఏప్రిల్ 1 నుంచి ఆయన భాద్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం వొడాఫోన్ బిజినెస్ సర్వీస్ డైరెక్టర్‌గా ఉన్న ఆయన 2004లో కార్పొరేట్ మార్కెటింగ్ వైస్‌ప్రెసిడెంట్‌గా సంస్థలో చేరారు. పదేళ్ల పాటు అత్యుత్తమ సేవలు అందించడంతో ఆయనను సీవోవోగా ఎంపిక చేసినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.