వ్యక్తిగత మరుగుదొడ్లతో సంపూర్ణ ఆరోగ్యం

మంథని ఆగస్టు 8 (జనంసాక్షి) : వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తిగా 100 శాతం నిర్మించుకునేలా జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో బుధవారం మంథని జూని యర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు మాట్లా డుతు కుటుంబంలోని ప్రతి వ్యక్తి సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతు నెల రోజులు గడిచి సరకి రూ. 200 నుండి 1000 వరకు ఖర్చు చేస్తారు కాని వ్యక్తి గత మరుగుదొడ్లు నిర్మించుకోవడంలో వెనక్కి తగ్గతారని ఇలా సెల్‌ ఫోన్‌కి ఇచ్చిన ప్రాధాన్యత మన అత్యవసరంగా ఉపయోగ పడే మరుగుదొడ్లకి ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ప్రతి కుటుంబం వ్యక్తి గత మరుగు నిర్మిం చుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యం పోందుతారని ఆయన అన్నారు. అలాగే ఆడపిల్లలు ఆరుబయట మాల విసర్జన చేయడానికి చాలా ఇబ్బంది పడుతా రని, కుటుంబంలోని ఆడవారు రాత్రి వేళాల్లో బయటకు రావలంటే భయ పడుతు జంకుతుంటారని, రాత్రివేళాల్లో బయటకు రావడం వల్ల విష పురు గులు, సర్పాల భయం ఉంటుందని ఇలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోవడం మంచిదన్నారు. ప్రతి కు టుంబంలోని చదువుకున్న వ్యక్తులు, మహిళలు మరుగుదొడ్లపై వారి కు టుంబ సభ్యులకు అవగాహన కల్పించి మరుగుదొడ్లు నిర్మించుకోవాలన్నా రు. అనంతరం జిల్లా కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌ మాట్లాడుతూ మరుగుదొడ్లు నిర్మాణానికి డివిజన్‌లోని అధికారులందరు పూర్తిగా బాధ్యత వహించి 100శాతం మరుగుదొడ్లు పూర్తియ్యేల చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు. మన జిల్లాలో మొదటి విడుదగా 16 మండలాల్లోని 41 గ్రామాల్లో 100 శా తం మరుగుదొడ్లు పూర్తి చేయనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలోని జగి త్యాల మండలంలో ఇప్పటికే 100శాతం మరుగుదొడ్లు నిర్మించుకున్నారని ఆమె అన్నారు. రెండో విడుతగా ఆగస్టు 20 తర్వాత మరుగుదొడ్లు నిర్మిం చుకోవడానికి 20 మండలాల్లోని 37 గ్రామాలను ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు. మరుగుదొడ్లు నిర్మించుకున్నావారికి రూ. 3200 తో పాటు జాబ్‌ కార్డు కలిగి ఉన్నట్లుయైతే అందులో రూ.1500 జమ అవుతాయని ఆమె తెలిపారు. నూతనంగా కట్టుకునే వారికి రూ. 4200 ప్రభుత్వం ద్వారా వారం రోజుల్లోపే చెల్లించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించిన ఆర్డీవో ఆయోషాఖాన్‌ మాట్లాడుతు మంథని డివిజన్‌లోని ముత్తారం మండలంలోని రామయ్యపల్లె గ్రామంలో ఇప్పటికే 100 శాతం మరుగుదొడ్లు నిర్మించుకున్నారని, మండలం వారిగా ఇప్పటి వరకు 45 శాతం కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మించుకోవడం జరిగిందని, మిగితా 55 శాతం కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మించుకునేలా చర్యలు చేపడుతామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ మనోహర్‌, ఆర్‌డబ్ల్యూఏ ఈఈ రాఘవులు, హన్మంతయ్యలు పాల్గొన్నారు.