వ్యక్తిని దారుణంగా చంపిన దుండగులు
కామారెడ్డి,మే4 (జనంసాక్షి): బాన్సువాడ మండలంలోని కొల్లూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఇందూరు నాగుగొండ (47) అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. నాగుగొండ కొల్లూర్‌లోని కల్లు దుకాణంలో నుంచి బయటకు వచ్చి టీవీఎస్ ఎక్సెల్‌పై వెళుతుండగా, దుండగులు వెనుక నుంచి వచ్చి గొడ్డలిలో నరికి చంపినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలిని పోలీసులు పరిశీలించారు. మృతుడు కొన్ని రోజుల క్రితం ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వలస వెళ్లివచ్చాడని గ్రామ ప్రజలు వెల్లడించారు. నాగుగొండ హత్యకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టంకోసం నాగుగొండ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.